హైదర్‌పేట వద్ద రోడ్డు ప్రమాదం.. క్యాబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్

బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం హైదర్‌పేట సమీపంలో బుధవారం అర్ధరాత్రి ఇసుక లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ, ముందున్న ఐచర్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐచర్ డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి అతడిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. టిప్పర్ అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్