తుళ్లూరు మండలం వెలగపూడిలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి తమ నివాసాన్ని మంత్రి లోకేష్ శుక్రవారం నాడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన భవన నిర్మాణ పనులు పై పురోగతిని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయాలని సిబ్బందికి సూచనలు చేసినట్లు సమాచారం. కాగా ఇప్పటికే మంత్రి లోకేష్ ఉండవల్లిలో అద్దెకు ఉంటున్న విషయం తెలిసిందే.