వేటపాలెం మండలం అణుమల్లిపేట గ్రామంలో శ్రీ మహాలక్ష్మమ్మ చెట్టు మందిరము వద్ద శ్రావణమాసం రెండవ శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మమ్మ తల్లిని వివిధ రకాల పూలతో అత్యంత వైభవంగా అలంకరించి పూలంగి సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు సామూహికంగా వివిధ రకాల పుష్పాలతో అమ్మవారిని సహస్రనామాలతో పుష్పాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యలక్ష్మి, అనంతలక్ష్మి, మంజుల, రమాదేవి, సత్యవతి, సమంత తదితర మహిళలు పాల్గొన్నారు.