వైసీపీని వీడి టీడీపీలో చేరిన 70 కుటుంబాలు

వినుకొండ పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం శావల్యాపురం మండలం పొట్లూరు గ్రామానికి చెందిన సుమారు 70 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో తాము టీడీపీలో చేరుతున్నట్లు ఆయా కుటుంబాలు తెలిపాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పార్టీలో చేరిన వారికి పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్