“అత్తామామల అరాచకం… అల్లుడిపై రక్తపాతం దాడి! ”

వినుకొండ పట్టణంలోని సంజయ్ గాంధీ నగర్ ప్రాంతంలో ఆదివారం కుటుంబ వివాదాలు హింసాత్మకంగా మారాయి. గౌతమ్ అనే యువకుడు తన భార్య, అత్తామామలతో విభేదాల నేపథ్యంలో జరిగిన ఘర్షణలో వారి దాడికి గురయ్యాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన గౌతమ్‌ను ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలు హింసకు దారితీయడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

సంబంధిత పోస్ట్