వినుకొండలో బంగారు వ్యాపారి కోటేశ్వరరావుపై ఐదుగురు వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేశారు. తన స్వగ్రామంలో నిర్మించిన ఆలయ ఖర్చుల వివరాలను కమిటీని అడిగినందుకు కక్ష పెంచుకున్న దుండగులు ఆయన దుకాణానికి వచ్చి దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన కోటేశ్వరరావు పోలీసులను ఆశ్రయించి, దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.