వినుకొండ హనుమాన్ నగర్ సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. సీతారామపురం తండాకు చెందిన వడితే తౌరియా నాయక్ ద్విచక్ర వాహనంపై వినుకొండ వైపు వస్తుండగా, అకస్మాత్తుగా అడ్డు వచ్చిన కుక్కను తప్పించబోయి వాహనం అదుపుతప్పి కిందపడిపోయాడు. ఈ ఘటనలో అతనికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రుడిని వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.