పల్నాడు రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి

పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం కనమర్లపూడి సమీపంలో గుంటూరు–కర్నూలు జాతీయ రహదారిపై గురువారం ఉదయం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న బాలుడిని వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రాలీ ఆటో ఢీకొట్టడంతో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్