ఇనుమెల్ల పొలాల్లో క్లూస్ టీం తనిఖీలు

ఈపూరు మండలం ఇనుమెల్ల గ్రామ సమీపంలోని పొలాల్లో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో రూ. 3 లక్షల విలువైన నీటి పైపులు కాలిబూడిదయ్యాయి. ఈ ఘటన కలకలం రేపింది. బాధిత రైతు వీరాంజనేయులు ఫిర్యాదు మేరకు ఈపూరు ఎస్‌ఐ వేణుగోపాల్ మంగళవారం క్లూస్ టీంను రప్పించి పరిశీలన చేపట్టారు. ప్రమాదవశాత్తు జరిగిందా లేక కక్షపూరితంగా నిప్పు పెట్టారా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన స్థలంలో క్లూస్ టీం పలు కీలక ఆధారాలను సేకరించినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్