వినుకొండలో నకిలీ సిగరెట్ల కలకలం

వినుకొండ పట్టణంలో నకిలీ సిగరెట్ల విక్రయాలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల సిగరెట్ ధరలు పెరగడంతో కొందరు వ్యాపారులు నకిలీ బ్రాండ్లను అమ్ముతున్నారని సమాచారం. గతంలో గంజాయి కేసుల్లో చిక్కుకున్న పాత నేరస్తులే ఈ దందా వెనుక ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఓ టీ షాపులో కంపెనీ ప్రతినిధులు తనిఖీలు చేసి నకిలీ సిగరెట్లను గుర్తించారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్