వినుకొండలో "సుపరిపాలన తొలి అడుగు" కార్యక్రమం

వినుకొండ పట్టణం 15వ వార్డులో శుక్రవారం "సుపరిపాలన తొలి అడుగు" కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పాల్గొని స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజలకు అందుతున్న సేవల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్