వినుకొండలో శనివారం ఉద్రిక్తత నెలకొంది. తిరుమల లడ్డూ వివాదం, ఫ్లెక్సీల గొడవ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తన అనుచరులతో కలిసి ర్యాలీగా బయలుదేరేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదని వారించడంతో వైసీపీ శ్రేణులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.