పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం కనమర్లపూడిలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో పదో తరగతి పూర్తి చేసిన రవీంద్ర అనే బాలుడు మృతి చెందాడు. ఇంటికి పాలు తీసుకురావడానికి బైక్‌పై వెళ్తుండగా, ట్రాలీ ఆటో ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.