విద్యుత్ సమస్యలపై వెంటనే స్పందన.. 1912కు కాల్ చేయండి: మంత్రి

రాష్ట్రంలో నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్ వినియోగం భారీగా పెరిగిందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. 49 డిగ్రీల వరకు ఎండలు నమోదవడంతో ట్రాన్స్‌ఫార్మర్లు వేడెక్కి, విద్యుత్ లైన్లు దెబ్బతిని కొన్ని ప్రాంతాల్లో అంతరాయాలు ఏర్పడుతున్నాయని చెప్పారు. అయితే రాష్ట్రంలో ఎలాంటి కరెంట్ కోతలు లేవని స్పష్టం చేసిన మంత్రి, విద్యుత్ సమస్యలు ఎదురైతే వెంటనే 1912 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు. అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన హోర్డింగ్లు విద్యుత్ లైన్లపై పడుతూ ప్రమాదాలకు కారణమవుతున్నాయని, అలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుని తొలగిస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్