ఈపూరు మండల కేంద్రమైన ఈపూరులో పొలం ఆక్రమణకు గురైందని తాసిల్దార్ కార్యాలయంలో విన్నవించిన తనకు న్యాయం జరగలేదంటూ గ్రామానికి చెందిన కొంగలు మందు డబ్బా తీసుకొని గురువారంగ్రామంలోని బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. ఈపూరు నుండి ముప్పాళ్ళ వెళ్లే దారిలో తనకు ఉన్న పొలానికి పక్కనే గోపువారిపాలెం గ్రామానికి చెందిన రైతులు కొందరు ఆక్రమణ చేశారనీ సదరు విషయాన్ని తాసిల్దార్ కార్యాలయంలో విన్నవించుకున్న తనకు న్యాయం జరగలేదంటూ బిఎస్ఎన్ఎల్ టవర్ హడావిడి చేశాడు.