కారంపూడిలో పట్టణం లో శనివారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకొని, రూ. 20 లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాలు భూమిపూజ చేశారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.