కుష్ఠు వ్యాధిపై అవగాహన: జనవరి 30 నుండి ఫిబ్రవరి 13 వరకు కార్యక్రమాలు

శావల్యాపురం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం, మండల వైద్యాధికారిణి డాక్టర్ రావిపూడి రమ్య ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కుష్ఠు వ్యాధిపై అవగాహనా కార్యక్రమాన్ని ప్రారంభించారు. జనవరి 30వ తేదీ నుండి ఫిబ్రవరి 13వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. శరీరంపై తెల్లని, రాగి రంగు స్పర్శ లేని మచ్చలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచించారు. ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్