బొల్లాపల్లి మండలంలో 2016లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద కేసులో లారీ డ్రైవర్‌కు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. మేళ్లవాగు సమీపంలో రోడ్డు పక్కన నిలిపి ఉన్న ఆటోను లారీ ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. కేసును విచారించిన న్యాయస్థానం నేరం రుజువు కావడంతో డ్రైవర్‌కు ఏడాది జైలుశిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది.