హెల్త్ క్లినిక్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం, వడ్డేoగుంట గ్రామంలో నూతనంగా నిర్మించనున్న హెల్త్ క్లినిక్‌కు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సోమవారం శంకుస్థాపన చేశారు. రూ. 36 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఈ క్లినిక్ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతి గ్రామంలోనూ అత్యాధునిక సౌకర్యాలతో కూడిన హెల్త్ క్లినిక్‌లను ఏర్పాటు చేస్తోందని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్