'మొంథా' తుఫాను నష్టంపై అధికారులతో పరిశీలించిన ఎమ్మెల్యే

గురువారం నూజెండ్ల మండలంలో 'మొంథా' తుఫాన్ కారణంగా జరిగిన నష్టాన్ని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అధికారులతో కలిసి పర్యటించి పరిశీలించారు. తుఫాన్ వల్ల తీవ్రంగా దెబ్బతిన్న రోడ్లను సందర్శించి, నీటి ప్రవాహానికి కోతకు గురైన రోడ్ల మరమ్మతులకు అంచనాలతో ప్రభుత్వానికి నివేదించాలని చీఫ్ విప్ జీవీ అధికారులను ఆదేశించారు. వర్షం, ఈదురు గాలులకు తెగిపోయిన కరెంటు తీగలు, విరిగిన, ఒరిగిన కరెంటు స్తంభాలను కూడా ఆయన పరిశీలించారు.

సంబంధిత పోస్ట్