పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామానికి చెందిన 98 ఏళ్ల కుమ్మరగుంట్ల పున్నమ్మ వృద్ధాప్యంతో గురువారం కన్నుమూశారు. ఆమె చివరి కోరిక మేరకు కుటుంబ సభ్యులు నేత్రదానానికి ముందుకు వచ్చారు. పున్నమ్మ నేత్రాలను ఐ బ్యాంక్‌కు దానం చేసినట్లు అమ్మ నేత్ర, అవయవ, శరీరదాన ప్రోత్సాహకుల సంఘం జిల్లా కోఆర్డినేటర్ ఎస్. చలపతిరావు తెలిపారు. ఈ నేత్రదానం ద్వారా ఇద్దరు దృష్టి లోపం ఉన్న వ్యక్తులకు చూపు లభించే అవకాశం ఏర్పడిందని, పున్నమ్మ చేసిన ఈ మహోన్నత దానం పలువురికి ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు.