వినుకొండలో అక్రమ గ్రావెల్ పై దాడి – రెండు టిప్పర్లు స్వాధీనం

వినుకొండలో ప్రభుత్వ భూముల్లో నుంచి అనుమతులు లేకుండా గ్రావెల్ (మట్టి) తవ్వి, భారీ టిప్పర్లలో తరలిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు మంగళవారం దాడి నిర్వహించారు. సీఐ ప్రభాకర్ నేతృత్వంలో జరిగిన ఈ దాడిలో రెండు టిప్పర్లను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అనుమతులు లేకుండా గ్రావెల్ తవ్వకం, రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ ప్రభాకర్ హెచ్చరించారు. అక్రమ కార్యకలాపాలు జరగకుండా ప్రజలు కూడా సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్