రూ. 5. 50 లక్షల పంట నష్టం.. మొక్కజొన్న దగ్ధం

వినుకొండ మండలంలోని కొప్పుకొండ గ్రామంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రెండ్రోజుల్లో కోతకు సిద్ధంగా ఉన్న ఎనిమిది ఎకరాల మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతైంది. యంత్రాలు ఆలస్యంగా రావడంతో కోత వాయిదా పడటమే దీనికి కారణమని స్థానికులు తెలిపారు. రైతులు బోయిన పెద చిన్నయ్య, చిన చిన్నయ్య, బైలడుగు పెద సుబ్బారావుకు చెందిన పంటలు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. సుమారు రూ. 5.50 లక్షల నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్