తల్లిపాలతోనే పిల్లలు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలుగుతారని డిప్యూటీ ఎంపీడీవో సుగుణ అన్నారు. శావల్యపురం మండల కేంద్రమైన శావల్యాపురం అంగనవాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను శుక్రవారం నిర్వహించారు. ముందుగా గ్రామంలో తల్లి పాలపై ఆవగాహన ర్యాలీ నిర్వహించి, అనంతరం తల్లిపాలు ఆవశ్యకతపై తల్లులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్వాస కోశ వ్యాధులు, కామెర్లు, డయేరియా వంటి రోగాలను ఎదుర్కొనే వ్యాధి నిరోధక శక్తి తల్లి పాలలోనే లభిస్తుందన్నారు.