సరైన ప్రణాళికతో గ్రామాల అభివృద్ధికి బాటలు వేయాలని ఎంపీడీవో పేరుమీన సీతారామయ్య అన్నారు. పంచాయతీల పురోగతి సూచికపై బుదవారం శావల్యాపురం మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, ఇంజినీరింగ్, డిజిటల్ సహాయకులు, ఆరోగ్య సిబ్బందికి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఈఓపిఆర్డి సుగుణ, ఎంఈఓ మద్దికుంట సాంబశివరావు, పంచాయతీ కార్యదర్శి లు, తదితరులు పాల్గొన్నారు.