శావల్యాపురం: నూరుశాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలి

జిల్లా విద్యాశాఖాధికారి చంద్రకళ బుధవారం మండలంలోని జడ్పీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతి ఫలితాల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా బోధన ఉండాలని, అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ సందర్భంగా పాఠశాల గ్రంథాలయం, ల్యాబ్, వంటగది, కిచెన్ గార్డెన్ వంటి వాటిని పరిశీలించి, అవసరమైన సూచనలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్