పల్నాడు జిల్లా కురిచేడు మండలం కల్లూరు గ్రామంలో భార్యను కాపురానికి పంపలేదన్న కోపంతో అల్లుడు తన అత్తపై ఇనుపరాడ్‌తో దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితురాలికి రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వైద్యం కోసం వినుకొండకు వచ్చిన అత్తను మార్గమధ్యంలో అడ్డగించి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దాడి చేసినట్లు సమాచారం. బాధితురాలిని వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం నరసరావుపేటకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందలేదని తెలిసింది.