తాడికొండలో శనివారం నాడు ఏర్పాటు చేసిన బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో అంబటి రాంబాబు మాట్లాడారు. పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రజలను అణచివేయాలని చూస్తే తిరుగుబాటు మొదలవుతుంది, మేము సంఘవిద్రోహశక్తులం కాదు ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలమని అంబటి రాంబాబు అన్నారు. ప్రతి కార్యకర్త కూడా ప్రజల్లోకి వెళ్లి బాబు ఇచ్చిన మోసపూరిత హామీలను అందరికీ వివరించాలని ఈ సందర్భంగా అంబటి రాంబాబు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.