పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో గురువారం అర్ధరాత్రి ఓ ఎలక్ట్రికల్ దుకాణంలో దొంగతనం జరిగింది. గుర్తుతెలియని దుండగులు దుకాణం తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి, విలువైన కేబుల్ వైర్ కాయిల్ బాక్సులను దొంగిలించారు. బాధితుడి ఫిర్యాదుతో సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్ఐ పుల్లారావు కేసు నమోదు చేసుకున్నారు. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.