బొల్లాపల్లి మండలం గుమ్మనంపాడు–రేమిడిచర్ల మార్గంలో శుక్రవారం ఒక ప్రమాదం తప్పింది. వినుకొండ డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సు స్టీరింగ్ బోల్టు ఊడిపోవడంతో అదుపుతప్పి రహదారి అంచుకు దూసుకెళ్లింది. ప్రయాణికులు భయంతో బస్సు దిగారు. తర్వాత బస్సు మరమ్మతు చేసి ప్రయాణం కొనసాగించారు. ఈ బస్సు రెండు ఏళ్లుగా మరమ్మతులకుు గురవుతున్నప్పటికీ ఇంకా వినియోగిస్తున్నారు.