వినుకొండ: గురుపౌర్ణమి వేడుకలు.. ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

వినుకొండలోని బోసుబొమ్మ సెంటర్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ సద్గురు శిర్డీ సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, అలంకరణలు, 108 దంపతులతో సత్యనారాయణ స్వామి వ్రతం జరిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం భక్తులు, ప్రజలకు అన్నదానం ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ తెలిపింది.

సంబంధిత పోస్ట్