వినుకొండ మండలంలోని పలు గ్రామాల్లో శనివారం అక్రమ మద్యం అమ్మకాలపై ఎక్సైజ్ సీఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అందుగుల కొత్తపాలెంలో మద్యం విక్రయిస్తున్న మందటి శ్రీనివాసరావు అనే వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు.