జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు వినుకొండ మండలంలో సివిల్ సప్లయ్స్ అధికారులు రేషన్ బియ్యం అక్రమ నిల్వలపై తనిఖీలు నిర్వహించారు. తహశీల్దార్ సురేష్ నాయక్ ఆధ్వర్యంలో విఠంరాజుపల్లి, బ్రాహ్మణపల్లి, ఏనుగుపాలెం సహా పలు రైస్ మిల్లుల్లో తనిఖీలు చేపట్టగా, ఏనుగుపాలెం రైస్ మిల్లులో 29 క్వింటాళ్లు రేషన్ బియ్యం గుర్తించి, శాంపిల్స్ తీసుకుని పరీక్షల నిమిత్తం పంపినట్టు అధికారులు తెలిపారు.