నరసరావుపేట నియోజకవర్గం శాసనసభ్యులు చదలవాడ అరవింద బాబు పట్టణంలోని స్థానిక 03 వ వార్డు నందు పారిశుద్ధ్య కార్యక్రమంలో శనివారం పాల్గొన్నారు. సైడ్ కాలువలోని పూడికను తీశారు వార్డు నాయకులతో కలిసి స్థానికులతో పలకరిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే స్థానికులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు.