గాంధీ విగ్రహంపై రాజకీయం తగదు అనీ ఎమ్మెల్యే జీవీ అన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే బొల్లా విగ్రహాల పేరుతో రాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు. పట్టణాభివృద్ధిలో భాగంగా మున్సిపల్ అధికారులు గాంధీ విగ్రహాన్ని తొలగిస్తే, దానిపై రాద్ధాంతం చేయాలని బొల్లా చూస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో, ఆర్యవైశ్య సంఘం కొత్తగా కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు.