వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్ లో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల విజ్ఞప్తులను సావధానంగా ఆలకించిన జీవీ, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని, ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.