వినుకొండ: రేపు ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్

వినుకొండ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికై శుక్రవారం ఎమ్మెల్యే కార్యాలయంలో 'ప్రజాదర్బార్' నిర్వహిస్తున్నట్లు కార్యాలయ వర్గాలు గురువారం ఒక ప్రకటనలో తెలిపాయి. ప్రజా దర్బార్ కు శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారని వెల్లడించారు. ఈ సందర్భంగా సమస్యలు ఉన్నవారు నేరుగా ఎమ్మెల్యేని కలిసి సమస్యలు వివరించవచ్చని ఆయన కార్యాలయం ప్రతినిధులు సూచించారు.

సంబంధిత పోస్ట్