వినుకొండ: కందులు కొనుగోలు ప్రారంభించాలి: ఎమ్మెల్యే

వినుకొండ నియోజకవర్గంలోని రైతుల వద్ద నుండి నిల్వ ఉన్న కందులను డాల్ మిల్లర్స్ సోమవారం నుండి కొనుగోలు చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు కోరారు. శుక్రవారం చీఫ్ విప్ కార్యాలయంలో మిల్లర్స్ తో సమావేశమయ్యారు. రైతుల వద్ద కందుల నిలవలను గుర్తించి మిల్లర్స్ ద్వారా కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్