వినుకొండ విద్యార్థినికి బాడ్మింటన్ లో రజత పతకం

వినుకొండలోని బీసీ హాస్టల్ లో ఉంటూ డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఆకుమల్ల సమీరా, మార్చి 28, 29 తేదీలలో తమిళనాడులోని టెంకాసిలో జరిగిన 44వ మహిళల సీనియర్ సౌత్ జోన్ బాల్ బాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీలలో ఆంధ్రప్రదేశ్ తరఫున రజత పతకం సాధించింది. శానంపూడి గ్రామానికి చెందిన సమీరా, వినుకొండలోని రాధా డిగ్రీ కాలేజీలో చదువుతూ, హాస్టల్ లో ఉంటూ ప్రతిరోజూ సాధన చేసేదని హాస్టల్ వార్డెన్ రత్నకుమారి తెలిపారు.

సంబంధిత పోస్ట్