హైర్ బస్సు డ్రైవర్లు, వర్కర్లు యూనియన్ 10వ వార్షికోత్సవాన్ని వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ లో గురువారం నిర్వహించారు. కార్యక్రమంలో వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ హైర్ బస్సు డ్రైవర్లు, కార్మికులు ప్రజా రవాణా వ్యవస్థలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. వారి సంక్షేమం కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు.