వినుకొండ పట్టణంలోని 20వ వార్డు కుమ్మరి బజార్లో ఇవాళ 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమం గురువారం నిర్వహించారు. కార్యక్రమంలో వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అవి ఎలా అమలవుతున్నాయో వివరించారు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూటమి ముందు ఉంటుందని తెలిపారు.