210 కోట్లతో వినుకొండ పట్టణానికి త్రాగునీటి పథకాన్ని పూర్తిచేసి శాశ్వతంగా త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తామని శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు తెలిపారు. పట్టణంలోని 20వ వార్డు కుమ్మరి బజారులో గురువారం సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటి ప్రచార కార్యక్రమానికి చీఫ్ విప్ జీవి ముఖ్యఅతిథిగా హాజరై స్వయంగా ఇంటింటికి తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధిని వివరిస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.