మంత్రి అనుచరుల వేధింపులే నా తల్లి మరణానికి కారణం: విద్యావతి కుమార్తె ఆవేదన

మంత్రి సంధ్యారాణి అనుచరుల వేధింపులు, ఉద్యోగం తీసేశార‌నే మాన‌సిక వేధ‌న‌తో డి. శిర్లాం ఆశావ‌ర్క‌ర్ విద్యావ‌తి కుమార్తె జ్యోత్న, తన తల్లి హార్ట్ ఎటాక్‌తో చ‌నిపోయింద‌ని ఆరోపించారు. ఉద్యోగం కోసం మంత్రి కాళ్ల మీద ప‌డినా క‌నిక‌రించ‌లేద‌ని ఆమె తెలిపారు. పార్వతీపురం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసిన జ్యోత్న, టీడీపీ నాయకులు దాకేటి గౌరు నాయుడు, వైద్యుడు హ‌రికృష్ణ‌ల వేధింపుల వల్లే తన తల్లి పొందూరు విద్యావతి మరణించిందని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్