ఏపీలో దళిత విద్యార్థులపై వేధింపులు (వీడియో)

AP: కాకినాడ జిల్లా, పిఠాపురం మండలం యండపల్లి హైస్కూల్‌లో దారుణం జరిగింది. దళిత విద్యార్థులపై జాతి వివక్ష చూపుతున్నారని, ఉపాధ్యాయులు 'మీది తక్కువ జాతి, ఎస్సీలు ఏమైనా పుడింగులు అనుకున్నారా..?' అని తిడుతున్నారని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపించారు. హెచ్‌ఎం కూడా ఆడపిల్లలను చెడ్డపేర్లతో పిలుస్తున్నారని బాధితులు వాపోయారు. గత కొంతకాలంగా తమ పిల్లలను అవహేళన చేస్తూ వేధిస్తున్నారని ఆరోపిస్తూ, హైస్కూల్ వద్ద బైఠాయించి విద్యార్థులు, తల్లిదండ్రులు నిరసన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్