AP: మాజీ సీఎం వైఎస్ జగన్‌కు ప్రభుత్వం సరైన భద్రత కల్పించడంలేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గుంటూరు మిర్చి యార్డు, రాప్తాడు, తెనాలి, పొదిలి, తాజాగా సత్తెనపల్లి. ఇలా ఆయన ఏ పర్యటనకు వెళ్లినా జగన్ కు సరైన భద్రత కల్పించటం లేదని ఆరోపిస్తున్నారు. కూటమి సర్కార్ జగన్ ను పూర్తిగా రాజకీయాల్లో లేకుండా చేయాలని స్కెచ్ వేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో చంద్రబాబు, లోకేష్ తీరు పట్ల వైసీపీ నేతలు మండిపడుతున్నారు.