వెల్లంపల్లికి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా?

AP: వైసీపీలో మూడేళ్లపాటు దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఉన్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో వైసీపీలో చేరి విజయవాడ పశ్చిమ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. పశ్చిమలో ఆయనపై వ్యతిరేకత వచ్చిందన్న కారణంతో.. 2024లో విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయించారు. ఇక్కడ వెల్లంపల్లికి చుక్కెదురైంది. దాంతో ఆయన సెంట్రల్ సీటు వైపు చూడటం మానేశారు. విజయవాడ పశ్చిమంపైనే ఫోకస్ పెట్టి పని చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేయడానికి జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్