AP: కూటమి పెద్దలతో విభేదాలున్నాయనే ప్రచారానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెక్ పెట్టారు. ఇటీవల వరుస కార్యక్రమాల్లో పాల్గొంటూ, సీఎం చంద్రబాబుతో కలిసి వేదిక పంచుకుంటున్నారు. స్థానిక ఎన్నికల్లో జనసేన 15 శాతం సీట్లలో పోటీ చేస్తుందని, అవసరమైతే టీడీపీపైనా పోటీ ఉంటుందని పవన్ ప్రకటించారు. ఆరోగ్య కారణాలతో విశ్రాంతి తీసుకున్న సమయంలో చెలరేగిన ఊహాగానాలకు తెరదించుతూ, కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని చాటేలా ఆయన వ్యవహరిస్తున్నారు. ఈ నెలలో పులివెందులలో జరిగే జలజీవన్ మిషన్ కార్యక్రమానికి సీఎంతో కలిసి పవన్ హాజరు కానున్నారు.