ఏపీలో మళ్లీ వంగవీటి రాజకీయం షురూ అయ్యిందా?

ఏపీలో మళ్లీ వంగవీటి రాజకీయం షురూ అయినట్లు తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో వంగవీటి మోహనరంగా విగ్రహ ఏర్పాటు అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. గాంధీ సెంటర్‌లో విగ్రహం ఏర్పాటు చేయాలన్న ప్రయత్నం నిలిచిపోవడంతో, రంగా అభిమానులు ప్రత్యామ్నాయ స్థలంలో విగ్రహ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. సుబ్రహ్మణ్య స్వామి ఆలయం సమీపంలో పనులు చేపడుతున్నప్పటికీ, ఇక్కడ కూడా అభ్యంతరాలు వ్యక్తం కావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మంత్రి కందుల అనుమతి ఉందని అభిమానులు చెబుతుండగా, కొందరు కావాలనే వివాదాన్ని సృష్టిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

సంబంధిత పోస్ట్

✕
✕