వృద్ధురాలికి అండగా నిలిచిన హెడ్ కానిస్టేబుల్ (వీడియో)

AP: ఎన్నికల విధుల్లో భాగంగా కృష్ణా జిల్లా గన్నవరం జడ్పీ బాయ్స్ హైస్కూల్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ నాగరాజు తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓ వృద్ధురాలు నిలబడలేని పరిస్థితిలో ఉండటాన్ని గమనించిన నాగరాజు వెంటనే స్పందించారు. ఆమెకు ఎత్తుకుని పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లి, ఆమె ఓటు హక్కును వినియోగించుకునేలా సహకరించారు.

సంబంధిత పోస్ట్

✕
✕