AP: లిక్కర్ రవాణా స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడు రాజ్ కేసిరెడ్డి నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు విచారణను ఈనెల 13కి వాయిదా వేసింది. మరోవైపు, ఈ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ వ్యవహారాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు విచారణను ముమ్మరం చేశారు. ప్రధాన నిందితులైన వాసుదేవ రెడ్డి, రాజ్ కేసిరెడ్డి, కారుమూరి సునీల్‌లను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఈడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.